శ్రీముఖి షోకు ఆదరణ తగ్గింది!
on Nov 30, 2020
నటిగా టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని కొన్ని సినిమాల్లో నటించిన అందాల శ్రీముఖి, అక్కడ ఊహించిన విధంగా అవకాశాలు రాకపోవడంతో టెలివిజన్‌పై దృష్టి పెట్టింది. యాక్ట్రెస్‌గా కంటే యాంకర్‌గా రాణించి, వీక్షకుల్లో మంచి ఆదరణను పొందింది. తెలుగు టీవీ రంగంలోని అతి కొద్దిమంది గ్లామరస్ యాంకర్లలో ఒకరిగా ఆమె పేరు తెచ్చుకుంది. ఏమాత్రం బెదురు లేకుండా, యమ యాక్టివ్‌గా కనిపిస్తూ, సందర్భోచితంగా డైలాగ్స్ చెబుతూ ప్రోగ్రామ్‌ను రక్తి కట్టిస్తుంటుంది శ్రీముఖి.
అలాంటిది, ఇటీవల ఆమె హోస్ట్‌గా చేస్తున్న ప్రోగ్రామ్స్ కళ తప్పుతున్నాయంటున్నారు వీక్షకులు. జీ తెలుగులో ఆమె హోస్ట్‌గా చేస్తున్న 'బొమ్మ అదిరింది' షోకు వస్తున్న టీఆర్పీయే ఇందుకు నిదర్శనం. దానికి 3.5 టీఆర్పీ నమోదవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కంటెంట్‌తో పాటు శ్రీముఖి పర్ఫార్మెన్స్ వీక్షకులు ఆశించిన రీతిలో లేనందునే దానికి ఆదరణ లభించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. శ్రీముఖి కూడా ఈ షోకు క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
