ఎన్టీఆర్ కూచిపూడి డాన్స్ పై శ్రీలీల తల్లి కామెంట్స్.. 1997 వ సంవత్సరంలో కదా మేడం
on Aug 23, 2025

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)డాన్సులకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై ఎన్టీఆర్ వేసే స్టెప్స్ లకి ,అభిమానులతో పాటుప్రేక్షకులు సీట్లపై నుంచి లేచి 'ఎన్టీఆర్' తో పాటు కాలు కదపాల్సిందే. అంతటి శక్తి ఎన్టీఆర్ డాన్స్ లకి ఉంది. భారతీయ చిత్ర పరిశమ్రకి చెందిన ఎంతో మంది నటులు, నటిమణులు కూడా, ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వూలలో చెప్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ఛానల్ జీ 5 వేదికగా 'జగపతి బాబు'(Jagapathibabu)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో కి సంబంధించిన రెండో ఎపిసోడ్ కి స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreleela)ఆమె తల్లి స్వర్ణలత(Swarnalatha)గెస్ట్ లుగా హాజరయ్యారు. స్వర్ణలత సుదీర్ఘ కాలం నుంచి అమెరికాలోని డాక్టర్ గా పని చేస్తున్నారు. బాల్యంలో ఎన్టీఆర్ కూచిపూడి నృత్య ప్రదర్శన ఇస్తున్న క్లిప్ ని 'షో 'లో డిస్ ప్లే చెయ్యడం జరిగింది. ఆ పిక్ ని ఉద్దేశించి స్వర్ణలత మాట్లాడుతు 'నాకు అమ్మాయి పుడితే డాన్స్ నేర్పించాలని నిర్ణయించుకున్న క్షణాలని గుర్తు చేసే ఫోటో అది. 1997 వ సంవత్సరంలో అమెరికాలోని లాస్ 'ఏంజలెస్' లో జరిగిన తానా సభల్లో ఆ ప్రదర్శన జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ తో మాట్లాడానని స్వర్ణలత చెప్పుకొచ్చింది.
ఈ మాటలు ఎన్టీఆర్(Ntr)అభిమానుల్లో జోష్ ని తెస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీలీల కాంబినేషన్ లో సినిమా రావాలని, ఆ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చూడాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల నటిగానే కాకుండా, డాన్స్ ల్లో హీరోలకి ఏ మాత్రం తీసిపోని రీతిలో అవలీలగా డాన్స్ లు చేస్తుంది. తన నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోని డాన్స్ లే ఉదాహరణ. శ్రీలీల ప్రస్తుతం 'మాస్ జాతర'(Mass Jathara), ఉస్తాద్ భగత్ సింగ్' లో చేస్తుండగా 'మాస్ జాతర' అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ తన చిరుప్రాయం నుంచే కూచిపూడి భరత నాట్యంలో ఎంతో ప్రావిణ్యం సంపాదించి దేశ, విదేశాల్లో అనేక ప్రదర్సనలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



