
షార్ట్ పీరియడ్ లోనే క్రేజీ హీరోయిన్ గా మారింది శ్రీలీల(Sreeleela).. ఏ సినిమా చూసినా హీరో మారడమే కానీ హీరోయిన్ మాత్రం శ్రీలీలనే. కానీ గత కొంత కాలం నుంచి శ్రీలీలకి సినీ కాలం పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా పెద్ద ప్రాజెక్టులని కోల్పోతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరో అజిత్ తన తదుపరి చిత్రాన్ని ప్రీవియస్ మూవీ గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీలని హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించింది. దీంతో అభిమానులు శ్రీలీలకి తమిళంలో భారీ బ్రేక్ ఇచ్చే మూవీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి శ్రీలీల తప్పుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కయదు లోహర్ ఆ ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టుగా చెప్తున్నారు. శ్రీలీల ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టమైన క్లారిటీ లేదు. కాల్‌షీట్ల అడ్జస్ట్‌మెంట్ సమస్యల కారణంగా ఆమె స్వచ్ఛందంగానే ఈ సినిమా నుండి తప్పుకుందా లేక చిత్ర యూనిట్ కావాలనే తప్పించారా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో రఫ్ఫాడిస్తున్న అఖిల్ అక్కినేని వన్ మాన్ షో 'లెనిన్' లో శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే(Bhagyaashri Borse)వచ్చి చేరిన విషయం తెలిసిందే.
Also read: బట్టలు విప్పమన్నారు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు
శ్రీలీలకి సౌత్ ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కొంత కాలంగా దానికి తగ్గ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. ప్రీవియస్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో శ్రీలీలకి వచ్చిన క్రేజీ ఆఫర్స్ వేరే హీరోయిన్స్ కి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
sreeleela, Bhagyaashri Borse, ajit kumar, akhil, lenin






