శ్రీలీల ఔట్.. ఒకటవుతున్న ప్రేమ పక్షులు
on Sep 26, 2023
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పేర్లలో ముందు వరుసలో ఉంది శ్రీలీల. డాక్టర్ చదువుతూ యాక్టర్‌గా మారిన ఈ సొగసరి చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి. అవి కూడా స్టార్ హీరోల సినిమాలే కావటం విశేషం. అయితే మరీ ఎక్కువైనా ఇబ్బంది తప్పదన్నట్లు అమ్మడి పరిస్థితి తయారైంది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్‌ను ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాకుండా శ్రీలీల జుట్టు పీక్కుంటుంది. ఇది తప్పక కొన్ని భారీ చిత్రాల మేకర్స్‌కు సారీ చెప్పేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీలీల ముందు ఓకే చెప్పి తర్వాత నో చెప్పిన సినిమాల లిస్టులో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా ఉంది. యూత్‌లో మంచి క్రేజ్ ఉండే హీరో, దర్శకుడి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాను వదులుకుందంటే శ్రీలీల ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
VD12 వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదొక స్పై థ్రిల్లర్. ఇందులో మన రౌడీస్టార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించబోతున్నారు. జెర్సీ వంటి క్రేజీ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవటంతో మేకర్స్ ఆమె స్థానంలో రష్మిక మందన్నను తీసుకొస్తున్నారని టాక్. ఇదే కనుక నిజమైతే నాలుగేళ్ల తర్వాత అంటే డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చేస్తున్న సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీరి కలయికలో సినిమా వస్తుందనే విషయం మాత్రం బిజినెస్ వర్గాల్లో హైప్‌ను తీసుకొస్తుందనటంలో సందేహం లేదు.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
