'గుంటూరు కారం'.. శ్రీలీల లుక్ వేరే లెవెల్!
on Jun 14, 2023

'అతడు', 'ఖలేజా' సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మహేష్ ఫస్ట్ లుక్ కి, టైటిల్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.
ఈరోజు(జూన్ 14) శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో లంగా ఓణి ధరించి నెయిల్ పాలిష్ వేసుకుంటున్న శ్రీలీల లుక్ ఆకట్టుకుంటోంది. ఆమె పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. 'ధమాకా' సినిమాలో శ్రీలీల లుక్ కి, ఆమె ఎనర్జిటిక్ డ్యాన్స్ లకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ బిగ్ ఫిల్మ్ 'గుంటూరు కారం'తో శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

'గుంటూరు కారం' చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పి.ఎస్.వినోద్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



