Home

»

Latest News

మెగా అల్లుడికి డైరెక్ట‌ర్ దొరికాడు

Aug 8, 2016 11:45AM

మెగా ఇంటి నుంచి మ‌రో హీరో రాబోతున్నాడ‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి అల్లుడు... శ్రీ‌జ భ‌ర్త క‌ల్యాణ్‌కి సినిమాల్లో న‌టించాల‌న్న యావ బీభ‌త్సంగాఉంద‌ట‌. ఈ విష‌యాన్ని చిరుకీ చెప్పాడ‌ని, మెగా ఇంట్లోనూ... క‌ల్యాణ్‌ని హీరో చేసేయాల‌న్న ఆలోచ‌న‌లు ఉదృతంగా ఉన్నాయ‌ని టాక్‌. శ్రీ‌జ కూడా `మా ఆయ‌న్ని హీరో చేయండి` అంటూ ఇంట్లో పోరెడుతోంద‌ట‌. దాంతో... క‌ల్యాణ్ కోసం క‌థ‌లు వండుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు మ‌రో అడుగు ముందుకు ప‌డిన‌ట్టు టాక్‌.  ఇప్పుడు క‌ల్యాణ్ సినిమాకి డైరెక్ట‌రూ ఓకే అయిపోయాడ‌ట‌. అత‌నే ప‌ర‌శురామ్‌.

ఇటీవ‌ల అల్లు శిరీష్‌తో శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తు సినిమా తీశాడు ప‌ర‌శురామ్‌. తొలి రోజు వ‌సూళ్లు బాగానే వ‌చ్చాయి. సినిమా సేఫ్ ప్రాజెక్టుగా మిగల‌బోతోంది. అందుకే.. గీతా ఆర్ట్స్ లో మ‌రో సినిమా చేయ‌మ‌ని అడ్వాన్సు కూడా ఇచ్చాడ‌ట అల్లు అర‌వింద్‌. ఆ సినిమా మెగా అల్లుడు క‌ల్యాణ్‌తోనే అని తెలుస్తోంది. క‌ల్యాణ్‌కి ముంద‌స్తు శిక్ష‌ణ ఎక్క‌డ ఇప్పించాలన్న విష‌యంలో మెగా ఫ్యామిలీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంద‌ట‌. త‌మ‌కు బాగా అచ్చొచ్చిన స‌త్యానంద్ ద‌గ్గ‌ర‌కే క‌ల్యాణ్‌కి పంపాల‌ని చిరు భావిస్తున్నార్ట‌. అంటే త్వ‌ర‌లోనే మెగా అల్లుడు మేక‌ప్ వేసుకోవ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com