.jpg)
పుట్టిన రోజులకు టీజరో, ట్రైలరో విడుదల చేసి అభిమానుల్ని అలరించాలనే ప్రత్యేక ఉద్దేశ్యాలేం ఉండవు పవన్ కల్యాణ్‌కి. అందుకే పవన్ కల్యాణ్ పుట్టినరోజులన్నీ సాదాసీదాగా గడిచిపోతాయి. ఆర్భాటాలంటే ఇష్టపడని పవన్ కల్యాణ్... మీడియాకి దూరంగా ఉండే పవన్ కల్యాణ్.. ఈసారి కాస్త మారాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం అందరినీ పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ టైమ్‌లో ఎక్కడ చూసినాపవన్ కల్యాణే కనిపించాడు. రాబోతున్న సినిమా కూడా ప్రచారం విషయంలో తీసిపోకూడదన్నది పవన్ ఆలోచన. అందుకే... ఆ హంగామా తన పుట్టిన రోజు నుంచే మొదలెట్టాలన్నది పవన్ ఉద్దేశం.
పవన్ కల్యాణ్ - డాలీ కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టారు. సెప్టెంబరు 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసే పనిలో ఉంది చిత్రబృందం. టైటిల్ ఏంటన్నది కూడా ఆ రోజే చెబుతారట. ఈ చిత్రం కోసం కడప కింగ్ అనే పేరు ప్రచారంలో ఉంది. పవన్ మాత్రం.. ఈ టైటిల్ పై విముఖత వ్యక్తం చేశాడని టాక్. ప్రస్తుతం డాలీ కొత్త టైటిల్ వెదికే పనిలో ఉన్నాడు. పవన్ టైటిల్ ఏంటన్నది.. సెప్టెంబరు 2నే తెలుస్తుంది.






