
బాబు బంగారం అంటూ... వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వెంకటేష్. ఈ సినిమా తరవాత వెంకీ ఫుల్ బిజీ. సాలా ఖద్దూస్ రీమేక్ మొదలెట్టనున్నారు. ఆ తరవాత కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయబోతున్నాడు. నేను శైలజ సినిమాతో ఆకట్టుకొన్నాడు కిషోర్. ఇప్పుడు వెంకీతో ఓ సినిమా చేస్తున్నాడు. స్క్రిప్టు సిద్ధమైంది. ఇప్పుడు టైటిల్ కూడా బయటకు వచ్చేసింది. ఈ చిత్రానికి ఆడవాళ్లూ మీకు జోహార్లూ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకీ ఇది వరకు 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' అంటూ వినోదాలు పంచాడు. ఆ సినిమా హిట్టయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈ టైటిల్‌లోనూ కనిపిస్తోంది. సాలా ఖదూస్ రీమేక్ పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. కథానాయిక, మిగిలిన వివరాలు త్వరలో తెలుస్తాయి.






