Home

»

Latest News

సెక్స్ ఎడిక్ట్ సరసన శ్రీముఖి!

Aug 1, 2016 9:32AM

ఒకపక్క టీవీ షోలు, మరోపక్క సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో విశేషమైన గుర్తింపు తెచ్చుకొన్న అందాల యాంకరమ్మ శ్రీముఖి ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోలు సైతం డంగైపోవాల్సిందే, అమ్మాయిగారి ఫాలోయింగ్ అలాంటిది మరి. ఇటీవల "థ్యాంక్యూ మిత్రమా" అనే షార్ట్ ఫిలిమ్ లోనూ నటించి శభాష్ అనిపించుకొంది. ప్రస్తుతం "పటాస్" షో ద్వారా తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న శ్రీముఖి మరో ఇంట్రెస్టింగ్ రోల్ దక్కించుకొంది. శ్రీనివాస్ అవసరాల టైటిల్ పాత్రలో రీమేక్ అవ్వనున్న బాలీవుడ్ అడల్ట్ ఫిలిమ్ "హంటర్"లో రెజీనా కథానాయికగా నటించనుండగా.. శ్రీముఖి మరో ముఖ్య పాత్ర పోషిస్తుందట. అమ్మడి క్యారెక్టర్ ఏంటనేది తెలియదు కానీ.. సదరు పాత్ర పోషించడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెబుతోంది శ్రీముఖి.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యాంకర్లలో అండంతోపాటు టాలెంట్ కూడా పుష్కలంగా ఉండి టీవి, సినిమా మాధ్యమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పాపులారిటీ సొంతం చేసుకొన్న ఏకైక యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి. అమ్మడు ఇదే విధంగా కంటిన్యూ అయితే అతి త్వరలోనే మాంచి పొజిషన్ కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com