Home

»

Latest News

అయిదు నెలల్లో చుట్టేస్తారా ??

Aug 1, 2016 9:52AM

స్టార్ హీరో సినిమా అంటే బోలెడు     హడావుడి ఉంటుంది. ప్రీ-ప్రొడక్షన్ వర్కే ఒక ఆరు నెలలు జరుగుతుంది, ఒక్కోసారి ఏడాది పాటు కూడా జరుగుతుందనుకోండి. ఇక షూటింగ్ మొదలై.. షెడ్యూల్స్ ఒక్కొక్కటిగా పూర్తి చేసి సినిమా రిలీజ్ అవ్వడానికి తక్కువలో తక్కువ వేసుకొన్నా ఏడాది పైనే పడుతుంది. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రాన్ని మాత్రం కేవలం అయిదు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబర్ నెలాఖర్లో లేదా జనవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ శనివారం (ఆగస్ట్ 6) మొదలుకానుంది. శృతిహాసన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో విలన్ గా "సర్దార్ గబ్బర్ సింగ్"తో పరిచయమైన శరద్ కేల్కర్ మరోమారు పవన్ కళ్యాణ్ తో కయ్యానికి సిద్ధమవుతున్నాడు. ఫ్యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ మూల కథ అందించడం విశేషం. మరి "సర్దార్ గబ్బర్ సింగ్" లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఈ తాజా చిత్రమైనా అభిమానుల్ని అలరిస్తుందో లేదో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com