ENGLISH | TELUGU  

ఎక్కడ జరిగింది పొరపాటు?

on Sep 28, 2017

కొన్ని సినిమాలకు బ్యాడ్ టాక్ వచ్చినా... చూస్తే బాగానే అనిపిస్తాయ్. బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’.. రవితేజ ‘నేనింతే’.. మహేశ్ బాబు ‘అతడు’, మురుగదాస్ ‘సెవన్త్ సెన్స్’... ఈ సినిమాలన్నీ అలాంటి కోవకే వస్తాయ్. థియేటర్లలో ఈ సినిమాలను ఆదరించని ప్రేక్షకులు... టీవీల్లో మాత్రం ఆదరిస్తుంటారు. ఎంజాయ్ చేస్తుంటారు. కారణం ఏంటి? అంటే ... "టైమ్".. అంతకంటే సమాధానం చెప్పలేం. 

‘స్పైడర్’ సినిమాక్కూడా ఇప్పుడు టాక్ సరిగ్గా లేదు. అయితే... ఈ సినిమా నచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ‘మరీ అంత బ్యాడ్  సినిమా ఏం కాదు’ అనేది వాళ్ల వాదన. ఇక్కడ ఎవరి అభిప్రాయం వారిది. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించాలి. మహేశ్ బాబు సినిమా అంటే... కచ్చితంగా అందరూ ఓ సారి చూస్తారు. అయితే... టాక్ ని బట్టి వెళ్లే వాళ్లు మాత్రం సినిమాను పక్కనపెట్టేస్తారు. వాళ్ల వల్లే సినిమాకు దెబ్బ. 

అసలు స్పైడర్ సినిమాలో జనానికి నచ్చే అంశాలేంటి? నచ్చని అంశాలేంటి? అనేది పాయింట్స్ వారీగా సరదాగా ముచ్చటించుకుందాం. 

నచ్చే అంశాలు:-

1. ముందు మురుగదాస్, మహేశ్ కాంబినేషన్ అనగానే సినిమాకు వెళ్లిపోయేవాళ్లు చాలామంది ఉంటారు. 

2. జన్మతః... మహేశ్  అందగాడు. ఈ సినిమాలో ఇంకా అందంగా ఉన్నాడు. యాక్టింగ్ పరంగా ఇందులో కొత్తగా చేసింది ఏమీ లేదు కానీ... ఉద్వేగపూరిత సన్నివేశాల్లో అద్భుతంగా చేశాడు. చాలా కష్టపడ్డాడు కూడా. 

3. కథ పాత కథే అయినా.. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు మురుగదాస్. ఊహకందనివి జరుగుతుంటాయ్. 

4. విలన్ కేరెక్టరైజేషన్. ఈ సినిమాకు ఓ విధంగా హైలైట్ ఇదే. అసలు వాడు సైకోలా ఎలా తయారయ్యాడు? అనే రీజన్ చాలా బాగా చెప్పాడు. సూర్య చిన్నప్పటి పాత్ర పోషించిన కుర్రాడు ఎవరో కానీ... చాలా బాగా చేశాడు. ఇక సూర్య... అసలు విలనీ ఇరగదీసేశాడు. కచ్చితంగా సూర్య పాత్ర కోసం ఈ సినిమా చూడొచ్చు.

5. రకుల్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది. 

6. సంతోష్ శివన్ కెమెరా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ రెండూ ఈ సినిమాకు ప్లస్. తెరంతా కొత్త ఫ్లేవర్ లో ఉంటుంది. 

7. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలకు ఇచ్చే వ్యాల్యూ సాటి మనిషికి ఇవ్వండి... అని చెప్పిన మెసేజ్
----------------------

నచ్చని అంశాలు:-

1. కథ.. ఇలా సైకోగాడు ఊరిమీద పడితే... వాడి నుంచి జనాన్ని కాపాడే కథలు ఇప్పటికే కోకొల్లలు వచ్చేశాయ్. 

2. ఇంటిలెక్చ్యువల్ స్క్రీన్ ప్లే. సాధారణమైన ప్రేక్షకుడికి అర్థమయ్యే అవకాశం తక్కువ. 

3. సహజత్వానికి ఆమడదూరంలో ఉండే సన్నివేశాలు. ఉదాహరణకు గృహిణులతో గోడలు దూకించడం.. బండరాయి రోడ్డు మీద బంతిలా దొర్లుకుంటూ వెళ్లడం... ఇలా కొన్ని ఉన్నాయ్

4. నాసిరకం గ్రాఫిక్స్... కోట్లు గుమ్మరించాం అని చెప్పుకొని.. మరీ ఇంత నాసిరకంగా గ్రాఫిక్స్ చూపించడం నిజంగా దారుణం. ఎందుకంటే... రిలీజ్ కి ముందు కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చుపెట్టాం... అని చెప్పుకున్నారు. చాలామంది రోబో స్థాయిలో ఊహించుకున్నారు. చివరకు తెరపై చూస్తే... ఏం కనిపించలా. అట్టముక్కలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ముక్కలు తప్ప. 

5. రకుల్ ఎంట్రస్ సన్నివేశం... ‘అది’ సమాజంలో జరుగుతున్నదే అయినా... అలా తెరపై చూపించి ఇంకొంతమంది అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయకూడదు కదా. ఇది ఓ వర్గం వారికి మాత్రమే నచ్చని విషయం. 

6. ద్వితీయార్థం ల్యాగ్...  సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది.

7. హేరిస్ జైరాజ్ నేపథ్య సంగీతం బావుంది కానీ... పాటలు మాత్రం పెద్ద గొప్పగా లేం. మంచి పాటలుంటే సినిమాకు ప్లస్ అయ్యేది. 

-------------------

నచ్చే అంశాలూ.. నచ్చని అంశాలూ ఇవి అన్నమాట... ఇది కేవలం మా అభిప్రాయమేనండోయ్.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.