నిఖిల్ కెరీర్ లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా 'స్పై'!
on Jun 28, 2023

యంగ్ హీరో నిఖిల్ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ రేపు(జూన్ 29) మరో పాన్ ఇండియా సినిమా 'స్పై'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే 'స్పై' మూవీ నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసింది.
ఇప్పటిదాకా నిఖిల్ కెరీర్ లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా 'కార్తికేయ 2' ఉంది. రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ 2'.. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.58 కోట్ల కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్' రీజినల్ సినిమా అయినప్పటికీ రూ.10.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి సత్తా చాటింది. ఇక ఇప్పుడు 'స్పై' పాన్ ఇండియా సినిమా కావడం, 'కార్తికేయ 2' తరహాలో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుందనే అంచనాలు నేపథ్యంలో బిజినెస్ భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.17.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.5.4 కోట్లు, సీడెడ్ లో రూ.2.2 కోట్లు, ఆంధ్రాలో రూ.6 కోట్ల బిజినెస్ చేయగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.13.6 కోట్లతో సత్తా చాటింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.5 కోట్ల బిజినెస్ జరిగింది. మరి 'కార్తికేయ 2'ని మించి బిజినెస్ చేసిన 'స్పై'.. బాక్సాఫీస్ దగ్గర కూడా అంతటి విజయాన్ని విజయాన్ని అందుకుంటుందేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



