పాకిస్థాన్ సినిమా పాటలు ఎక్కడున్నాయి..స్ఫోటిఫై నుంచి తీసారా!
on May 15, 2025

పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ మూలాలు ఉన్న సినిమాలు, వెబ్ సిరిస్, పాటలు, పాడ్ కాస్ట్ లతో సహా ఇతర మీడియా కంటెంట్ లని నిలిపివేయాలని అన్ని ఓటిటి సంస్థలకి ఈ నెల 8 న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.
ఆ ఆదేశాల్లో భాగంగా ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ 'స్ఫోటిఫై'(Spotify)పాక్ నటీనటుల పాటలని పూర్తిగా తొలగించింది. దీంతో ప్రముఖ మాండ్, జోల్ వంటి ఫేమస్ ట్రాక్స్ స్ఫోటిఫై నుంచి మాయమయ్యాయి. దీంతో పాకిస్థాన్ ని సినిమాల పరంగాను దెబ్బ కొట్టినట్టయ్యింది. మరోవైపు పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా హిందీలో నటించిన 'అభీర్ గులాల్'(Abir Gulaal)మూవీ మే 9 న విడుదల కావాల్సి ఉంది. హీరోయిన్, నిర్మాత, మిగతా నటీనటులు మన దేశం వాళ్లేనటించారు. కానీ ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ చిత్రం బ్యాన్ అయ్యింది. ఫవాద్ ఖాన్ గతంలో కొన్ని హిందీ చిత్రాల్లో నటించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



