
ఎవరి అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తుంటారో ఆ అప్ డేట్ రానే వచ్చింది. సోషల్ మీడియా సైతం మేము కూడా సదరు న్యూస్ కి అభిమానులమే అనే రీతిలో అందరికి ఆ న్యూస్ సువాసనలు అందేలా చేస్తుంది. దీంతో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి( Sandeep Reddy)ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.
ప్రభాస్, సందీప్ రెడ్డి స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చి 5 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ చెప్పిన డేట్ కి రావడం లేదు. ప్రభాస్ సినిమాలు కూడా అందుకు ఉదాహరణగా ఉన్నాయి. కానీ తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం సందీప్ ఈ సంవత్సరం సెప్టెంబర్ చివరికల్లా కంప్లీట్ చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో నెక్స్ట్ ఆలోచనకి తావు ఇవ్వకుండా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్టుగా సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. కంటెంట్ కూడా చాలా అడ్వాన్స్ గా ఉండబోతున్నటుగా తెలుస్తుంది.
Also read: Ashu reddy: అషు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం.. వామ్మో మరింత దారుణమా!
సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎంత ఊరమాస్‌గా చూపిస్తారో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ కేవలం ఒక పోలీస్ ఆఫీసర్‌గానే కాకుండా, మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు 'స్పిరిట్'లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ 'యానిమల్' రేంజ్‌లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ తో అందాల భామ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)జత కడుతుంది.




