'నారప్ప' వెనక్కి.. 'ఎఫ్ 3' ముందుకి?
on Oct 14, 2020

విక్టరీ వెంకటేష్ 75 సినిమాల మైలురాయికి చేరుకున్నారు. లెక్క ప్రకారం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చిత్రీకరణ ప్రారంభించి, కొంత వరకు పూర్తి చేసిన 'నారప్ప' ఆయనకు 74వ సినిమా. దీని తరవాత చేయబోయే 'ఎఫ్ 3' 75వ సినిమా కావాలి. కానీ, కరోనా ఈ లెక్కలను మారుస్తోందని టాక్.
'నారప్ప'లో వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో తీయాల్సిన కొన్ని సీన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఇప్పటికి ఇప్పుడు తీయాలని నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు తొందర పడటం లేదు. మరోవైపు 'ఎఫ్ 3' స్క్రిప్ట్ వర్క్ అనిల్ రావిపూడి కంప్లీట్ చేశాడు. తక్కువమంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో ఆ సినిమా చిత్రీకరణ చేయవచ్చు. 'నారప్ప' కంప్లీట్ చేయడం కంటే ముందు ఆ సినిమా ప్రారంభిస్తే ఎలా ఉంటుందని డిస్కషన్లు జరుగుతున్నాయట. 'ఎఫ్ 3'ని ముందుకు తీసుకువచ్చి, 'నారప్ప'ను వెనక్కి తీసుకువెళ్లాలని చూస్తున్నారట.
'ఎఫ్ 3' మల్టీస్టారర్ సినిమా. 'నారప్ప' సోలో హీరో సినిమా. తమ్ముడి 75వ సినిమా మల్టీస్టారర్ కంటే సోలో హీరోగా ఉంటే బాగుంటుందని సురేష్ బాబు అనుకుంటున్నారట. అదీ సంగతి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



