సూర్యకు ఆకాశమే హద్దు!
on Nov 10, 2019
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న 'సూరారై పొట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదల కానున్నది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంలో జరిగిన ఘటనలను ఆధారం చేసుకొని బయోగ్రాఫికల్ డ్రామాగా ఈ సినిమాని సుధ రూపొందిస్తున్నారు. అపర్ణ బాలమురళి నాయికగా నటిస్తోన్న ఈ మూవీని 2డి ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. తెలుగు టైటిల్‌కు తగ్గట్లు రెండు చేతులూ పూర్తిగా చాపి పైకి ఎగురుతున్న సూర్య ఈ లుక్‌లో కనిపిస్తున్నారు. 'ఒక సాధారణ వ్యక్తి కన్న ఒక అసాధారణ కల' నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
సూర్య మునుపటి రెండు సినిమాలు 'ఎన్జీకే', 'బందోబస్త్' (తమిళంలో 'కాప్పాన్') సినిమాలు అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆశించిన రీతిలో ఆడలేదు. 'ఆకాశం నీ హద్దురా' సినిమా పూర్తవగానే, 'ఖైదీ' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు సూర్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లోకేశ్ ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు.
కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణకుమార్ తారాగణమైన 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి స్క్రీన్ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర, మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: శ్రీనికిత్ బొమ్మిరెడ్డి, ఎడిటర్: సతీష్ సూర్య, ఆర్ట్ డైరెక్టర్: జాకీ, కో ప్రొడ్యూసర్: రాజశేఖర్ కర్పూర పాండ్యన్, కథ, దర్శకత్వం: సుధ కొంగర.