ఖమ్మం చిన్నారికి ముంబైలో గుండె ఆపరేషన్ చేయించిన సోను సూద్!
on Oct 20, 2021
నటుడు సోను సూద్ దాతృత్వానికి ఎల్లలు లేవని మరోసారి నిరూపితమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక చిన్నారికి ముంబైలో గుండె ఆపరేషన్ చేయించి మరోసారి తన మంచి మనసును ఆయన చాటుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు.
ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సోను సూద్‌కు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన సోనూసూద్.. వారిని ముంబై రప్పించుకున్నారు. ముంబైలోని వాడియా హాస్పిటల్లో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోను సూద్‌కు కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read