'రాజా విక్రమార్క' రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Oct 20, 2021
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రాజా విక్రమార్క' రిలీజ్ డేట్ వచ్చేసింది. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీ నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. ఈ విషయాన్ని రిలీజ్ డేట్ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ఆ పోస్టర్‌ను షేర్ చేసిన నిర్మాతలు, "Witness the fun and guts of our Agent Vikram aka @ActorKartikeya in theatres near you" అని రాసుకొచ్చారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై '88' రామారెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
కార్తికేయ సరసన సీనియర్ తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటిస్తూ, తెలుగుతెరకు పరిచయమవుతోంది. నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ "మా 'రాజా విక్రమార్క' కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. గుడిలో కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయి. కథ ప్రకారం పురావస్తు శాఖవారు క్లోజ్ చేసిన టెంపుల్ అయ్యి ఉండాలి. లక్కీగా మాకు గండికోటలో అటువంటి టెంపుల్ దొరికింది. అందులో దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారు. మారేడుమిల్లిలో అందరూ చిత్రీకరిస్తున్న లొకేషన్లో కాకుండా... యునీక్ లొకేషన్‌కు వెళ్లి, భారీ రబ్బరు ఫారెస్టులో కీలక సన్నివేశాలు తీశాం. డంప్ యార్డ్‌లో ప్రీ క్లైమాక్స్ షూట్ చేశాం. మేకింగ్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. హీరో కార్తికేయ సహకారంతో సినిమా బాగా వచ్చింది. నవంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.
దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ "కార్తికేయ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఆయన ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఎంటర్టైనింగ్గా సాగే యాక్షన్ రోల్‌కు కార్తికేయ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు" అన్నారు.
సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చగా, పి.సి. మౌళి సినిమాటోగ్రఫీ అందజేశారు. సుబ్బు, నబా, పృథ్వే శేఖర్ డిజైన్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.
Also Read