సోనాక్షి సిన్హాకు కోప్పడినందుకు అవార్డు..!
on May 18, 2016

ఎవరికైనా బాగా పెర్ఫామ్ చేసినందుకో, లేక ఏదైనా సేవ చేసినందుకో అవార్డు ఇస్తారు. అయితే సోనాక్షికి మాత్రం ఒక విచిత్రమైన అవార్డు వచ్చింది. ఆ అవార్డు బాగా కోప్పడినందుకు వచ్చిందట. విచిత్రంగా ఉంది కదా. విషయంలోకి వెళ్తే, యాంగ్రీ బర్డ్స్ అనే గేమ్ చాలామందికి ఇష్టమైన గేమ్. ఒక టైంలో అయితే, ఎవరి సెల్ లో చూసినా ఈ గేమ్ కనిపించేది. తాజాగా హాలీవుడ్ లో ఈ ఆట ను సినిమాగా తీస్తున్నారు. మే 27న ఇండియాలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మూవీ టీం విభిన్నమైన ప్రచార కార్యక్రమాలు ఎంచుకుంటున్నారు. అందుల్లో భాగంగానే, బాగా కోప్పడిన సెలబ్రిటీలకు ద యాంగ్రీస్ అవార్డు ఇస్తున్నారు. సోనాక్షి సిన్హా గతంలో తనపై నెట్ లో జోకులు వేస్తున్న వారిని చాలా గట్టిగా తిడుతూ రిప్లై ఇచ్చింది. సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా కోప్పడిన ఆమెకు ఈ అవార్డ్ కరెక్ట్ అని యాంగ్రీబర్డ్స్ టీం భావించిందట. సో సోనాక్షి సిన్హా ఈ అవార్డును గెలుచుకుందన్నమాట. అదండీ విషయం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



