సత్యమూర్తి.. రూ.70 కోట్లా??
on Apr 10, 2015
.jpg)
అల్లు అర్జున్ రేసుగుర్రం తో సూపర్ హిట్ కొట్టాడు. అత్తారింటికి దారేదితో త్రివిక్రమ్ ఇండ్రస్ట్రీ హిట్టు కొట్టాడు. వీళ్లిద్దరూ కలసి జులాయి అనే హిట్ ఇచ్చారు. అందుకే వాళ్ల నుంచి మరో సినిమా వస్తోందంటే అంచనాలు అంబరాల్ని తాకాయి. సన్నాఫ్ సత్యమూర్తి బిజినెస్‌కి విపరీతమైన హైప్ వచ్చింది. అన్ని ఏరియాల నుంచీ ఈ సినిమాని ఫ్యాన్సీ రేట్లకు కొనేసుకొన్నారు. రేసుగుర్రం ఎంత కలెక్ట్ చేసిందో.. దానికి అయిదు పది లక్షలు అటూ ఇటూగా ఈ సినిమాని అమ్మేశారట. దాంతో మొత్తానికి ఈ సినిమాకి రూ.70 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా. ఈ అంకెలు నిజమైతే బన్నీ కెరీర్‌లోనే ఇది ఓ రికార్డుగా మిగిలిపోతుంది. సినిమాకి ఇప్పుడు డివైడ్ రావడంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారు. తమ పెట్టుబడి తిరిగివస్తుందా, రాదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఫస్ట్ డే వసూళ్ల పరంగా సత్యమూర్తి రికార్డులు కొల్లగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.11 కోట్లు సాధించాడని లెక్కలు చెబుతున్నాయి. శుక్ర, శని, ఆదివారాలే సత్యమూర్తిని కాపాడాలి. ఈ మూడు రోజుల్లో ఎంత వసూలు చేస్తుందనేదాన్ని బట్టి బయ్యర్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



