Home

»

Latest News

వెబ్ - సిరీస్ లో సూర్య‌!

Sep 27, 2021 1:19PM

`వాలి` (1999), `ఖుషి` (2001) చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్. జె. సూర్య‌. గ‌త కొంత‌కాలంగా న‌ట‌న‌పై దృష్టి సారించిన ఈ మ‌ల్టిటాలెంటెడ్.. `స్పైడ‌ర్` (2017), `అదిరింది` (2017) వంటి సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగా మెప్పించారు. రీసెంట్ గా విడుద‌లైన త‌మిళ చిత్రం `నెంజ‌మ్ మ‌ఱ‌ప్పదిల్లై`లో మ‌రోసారి త‌న అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేశారు సూర్య‌. ప్ర‌స్తుతం శింబు న‌టిస్తున్న `మానాడు`, శివ‌కార్తికేయ‌న్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న `డాన్`లో విల‌న్ గా న‌టిస్తున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో ఎస్.జె. సూర్య ఓ వెబ్ - సిరీస్ లో న‌టించ‌బోతున్నార‌ట‌. `ఐశ్వ‌ర్య‌` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సిరీస్  దాదాపు రూ.40 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంద‌ని.. ఇందులో సూర్య పాజిటివ్ రోల్ లో క‌నిపిస్తార‌ని స‌మాచారం. విజ‌య్ ఆంటోని, అర్జున్ కాంబినేష‌న్ లో `కొలైకార‌న్` (తెలుగులో `కిల్ల‌ర్` పేరుతో అనువాద‌మైంది) వంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించిన ఆండ్రూ లూయిస్ ఈ సిరీస్ ని రూపొందిస్తార‌ని వినికిడి. `డాన్` చిత్రానికి సంబంధించి త‌న షూటింగ్ పార్ట్ పూర్త‌వ‌గానే.. ఈ సిరీస్ కి సిద్ధ‌మ‌వుతార‌ట సూర్య‌. మ‌రి.. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ఎంట‌ర్టైన్ చేస్తున్న ఎస్.జె. సూర్య‌.. ఈ సిరీస్ తో ఎలాంటి గుర్తింపుని పొందుతారో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com