Home

»

Latest News

ఆర్య‌-స‌యేషా కూతురికి స్వ‌చ్ఛ‌మైన‌ పేరు పెట్టారు!

Sep 27, 2021 1:19PM

 

డాట‌ర్స్ డే సంద‌ర్భంగా ఒక సెల్ఫీని షేర్ చేసిన న‌టుడు ఆర్య‌, "నాన్న‌నై రెండు నెల‌లు" అని రాశాడు. త‌మ ముద్దుల త‌న‌య‌కు 'అరియానా' అనే పేరు పెట్టిన‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు. అరియానా అనేది గ్రీకు ప‌దం. దాని అర్థం 'చాలా ప‌విత్ర‌మైంది' అని. ఆర్య భార్య న‌టి స‌యేషా ఈ ఏడాది జూలై 24న పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఆ వార్త‌ను మొద‌ట ప్ర‌పంచానికి వెల్ల‌డించింది ఆర్య‌కు ఆప్త‌మిత్రుడైన హీరో విశాల్‌. "ఈ వార్త‌ను తెలియ‌జేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంకుల్ అయినందుకు గొప్ప‌గా ఉంది. నా బ్ర‌ద‌ర్ జ‌మ్మీ (ఆర్య‌), స‌యేషాల‌కు పాప పుట్టింది. షూటింగ్ మ‌ధ్య‌లో ఎమోష‌న్స్ కంట్రోల్ కావ‌ట్లేదు. వారికెప్పుడూ మంచి జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ కోరుకుంటాను. నాన్న‌గా కొత్త బాధ్య‌త‌లు తీసుకుంటున్న ఆర్య‌కు, స‌యేషాకు అభినంద‌న‌లు" అని అప్పుడు షేర్ చేశాడు విశాల్‌.

స‌యేషా త‌ల్లి ష‌మీన్ కూడా త‌న మ‌న‌వ‌రాలికి పేరు పెట్టిన విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుని, మురిసిపోయారు. 'అరియానా' అనే అక్ష‌రాల నోట్‌ను పోస్ట్ చేసిన ఆమె, "నా మ‌న‌వ‌రాలికిప్పుడు రెండు నెల‌లు. త‌న పేరు నా స్నేహితులు తెలుసుకోవాలి. అది.. అరియానా! దాన‌ర్థం స్వ‌చ్ఛ‌మైంది అని. త‌న పేరుకు ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని పాప తండ్రి ఆర్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. స‌యేషా ఆ పేరును బాగా ఇష్ట‌ప‌డింది, మేం కూడా." అని రాసుకొచ్చారు.

ఆర్య‌, స‌యేషా త‌మిళ చిత్రం గ‌జినీకాంత్ సినిమా సెట్స్‌పై తొలిసారి క‌లుసుకుని, త్వ‌ర‌గా ప్రేమ‌లో ప‌డ్డారు. 2019లో హైద‌రాబాద్‌లో స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com