Home

»

Latest News

'ఆదిపురుష్' రిలీజ్ డేట్ వచ్చేసింది

Sep 27, 2021 12:49PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలలో 'ఆదిపురుష్' ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. తాజాగా మేకర్స్ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'ఆదిపురుష్' సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పౌరాణిక చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. తెలుగుతోపాటు.. హిందీ, మళయాలం, కన్నడ, తమిళ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. 

కాగా, ప్రభాస్ ఇప్పటికే 'రాధేశ్యామ్' షూటింగ్ పూర్తి చేశారు. అలాగే 'ఆదిపురుష్'తో పాటు ప్రశాంత్ నీల్ తో 'సలార్', నాగ్ అశ్విన్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com