Home

»

Latest News

`బంగార్రాజు`పైనే `శివ‌గామి` ఆశ‌లు!

Nov 27, 2021

`బాహుబ‌లి` సిరీస్ లో శివ‌గామిగా మెస్మ‌రైజ్ చేశారు వెట‌ర‌న్ యాక్ట్ర‌స్ ర‌మ్య‌కృష్ణ‌. ఈ చిత్రాల‌తో న‌టిగా ర‌మ్య‌కృష్ణ స్థాయి మ‌రింత‌గా పెరిగింది. అలాగే.. తెలుగునాట‌ మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, ప‌వ‌ర్ ఫుల్ రోల్స్ ఆమె కోసం క్యూ క‌ట్టాయి. అయితే, `బాహుబ‌లి` సిరీస్ న‌డుమ‌, త‌రువాత ర‌మ్య ప్ర‌ధాన పాత్రలో న‌టించిన తెలుగు చిత్రాల్లో ఒక్క `సోగ్గాడే చిన్ని నాయ‌నా` మాత్ర‌మే విజ‌యం సాధించింది. త‌న ల‌క్కీ హీరోల్లో ఒక‌రైన కింగ్ నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య న‌టించిన ఈ సినిమా.. 2016 సంక్రాంతికి సంచ‌ల‌నం సృష్టించింది. క‌ట్ చేస్తే.. ఈ సిరీస్ లో త‌దుప‌రి చిత్రంగా ఇప్పుడు `బంగార్రాజు` రాబోతోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సోషియో ఫాంట‌సీ డ్రామా 2022 పొంగ‌ల్ స్పెష‌ల్ గా సంద‌డి చేయ‌నుంది.

కాగా, రీసెంట్ టైమ్స్ లో `బాల‌కృష్ణుడు`, `హ‌లో`, `శైల‌జా రెడ్డి అల్లుడు`, `రిప‌బ్లిక్`, `రొమాంటిక్`.. ఇలా త‌ను ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ముంగిట‌ నిరాశ‌ప‌రిచిన నేప‌థ్యంలో.. `బంగార్రాజు`పైనే ఆశ‌లు పెట్టుకుందీ సిల్వ‌ర్ స్క్రీన్ శివ‌గామి. మ‌రి.. ర‌మ్య‌కృష్ణ‌కి `బంగార్రాజు` రూపంలో ఐదేళ్ళ త‌రువాత విజ‌యం వ‌రిస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే.. క‌ళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న `బంగార్రాజు`లో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, `ఉప్పెన‌` ఫేమ్ కృతి శెట్టి మ‌రో జంట‌గా న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com