Home

»

Latest News

సేమ్ డే(ట్)ని టార్గెట్ చేసుకున్న `పింక్` రీమేక్ స్టార్స్!

Nov 27, 2021 5:00PM

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కోర్ట్ డ్రామా `పింక్`(2016)ని త‌మిళంలో `నేర్కొండ పార్వై`(2019), తెలుగులో `వ‌కీల్ సాబ్` (2021) టైటిల్స్ తో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. `నేర్కొండ పార్వై`లో కోలీవుడ్ స్టార్ త‌ల అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా.. `వ‌కీల్ సాబ్`లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముంగిట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి.

ఇదిలా ఉంటే.. `పింక్` రీమేక్స్ త‌రువాత ఇటు ప‌వ‌న్, అటు అజిత్.. త‌మ త‌దుప‌రి చిత్రాల‌తో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ ఇద్ద‌రి సినిమాలు కూడా ఒకే డేట్ ని టార్గెట్ చేసుకున్నాయి. `వ‌కీల్ సాబ్` త‌రువాత ప‌వ‌న్ న‌టిస్తున్న తెలుగు చిత్రం `భీమ్లా నాయ‌క్` సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 12న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుండ‌గా.. `నేర్కొండ పార్వై` త‌రువాత అజిత్ హీరోగా న‌టించిన త‌మిళ సినిమా `వ‌లిమై` పొంగ‌ల్ స్పెష‌ల్ గా అదే 2022 జ‌న‌వ‌రి 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. మ‌రి.. సేమ్ డే(ట్)ని టార్గెట్ చేసుకున్న `పింక్` రీమేక్ స్టార్స్ ప‌వ‌న్, అజిత్.. ఆయా చిత్రాల‌తో ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com