Home

»

Latest News

పేర్ని నాని గారూ.. త్రివిక్ర‌మ్‌కు ఎలాంటి సోష‌ల్ మీడియా ఖాతాలు లేవు!

Nov 27, 2021 4:15PM

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై డైరెక్ట‌ర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ చేసిన ట్వీట్‌ను ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తాన‌ని ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని చెప్పారు. శుక్ర‌వారం జ‌రిగిన మీడియా ప్ర‌తినిధుల స‌మావేశంలో ఆయ‌న త్రివిక్ర‌మ్ ట్వీట్ ప్ర‌స్తావ‌న చేశారు. అయితే నిజానికి త్రివిక్ర‌మ్‌కు సొంతంగా సోష‌ల్ మీడియాలో ఎలాంటి హ్యాండిల్స్ లేవు. ఆయ‌న పేరుతో ట్విట్ట‌ర్‌లో చ‌లామ‌ణీ అవుతున్న హ్యాండిల్స్‌లో ఏ ఒక్క‌టీ ఆయ‌న‌ది కాదు. ఇదే విష‌యాన్ని త్రివిక్ర‌మ్‌కు సొంత నిర్మాణ సంస్థ లాంటి హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నొక్కి చెప్పింది.

శ‌నివారం ఆ సంస్థ త‌న అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా "త్రివిక్ర‌మ్ నుంచి వ‌చ్చే ఏ అధికారిక ప్ర‌క‌ట‌న అయినా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఫార్చూన్ 4 సినిమాస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్స్ నుంచి మాత్ర‌మే వ‌స్తాయి. ఆయ‌న‌కు ఎలాంటి సోష‌ల్ మీడియా ప్రెజెన్స్ లేదు. ఆయ‌న పేరుతో న‌డిచే వివిధ ప్రొఫైల్స్ చేసే ఎలాంటి కామెంట్స్ అయినా ద‌య‌చేసి న‌మ్మ‌కండి" అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌ను @AndhraPradeshCM @perni_nani @IPR_AP కు ట్యాగ్ చేసింది.

వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం త‌ను ర‌చ‌న చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ 'భీమ్లా నాయ‌క్" విడుద‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నారు. ఆ సినిమా విడుద‌లైన వెంట‌నే మ‌హేశ్‌బాబు హీరోగా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మించే సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు.

 

రానా బ‌ర్త్ డేకి `భీమ్లా నాయ‌క్` స్పెష‌ల్ విజువ‌ల్ ట్రీట్!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com