షారుఖ్‌తో పోటీపడుతున్న శివకార్తికేయన్!
on Mar 19, 2023
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా వెయ్యి కోట్లను దాటిన సినిమాలు ఐదంటే ఐదే ఉన్నాయి. వాటిలో ఒకటి పఠాన్. 50 రోజుల రన్‌ని కంప్లీట్ చేసుకుని వంద రోజుల వైపు దూసుకుపోతోంది. నాలుగేళ్లుగా కరవుమీదున్న షారుఖ్‌కి కడుపునిండా హిట్ ఇచ్చిన సినిమా పఠాన్. ఈ సినిమా సక్సెస్‌తోనే నెక్స్ట్ సినిమాకు డబుల్ జోష్‌తో పనిచేస్తున్నారు షారుఖ్‌ఖాన్. ఆయన నటిస్తున్న జవాన్ సినిమా జూన్‌లో విడుదల కానుంది. అట్లీ డైరక్ట్ చేస్తున్న ఆ మూవీలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు. నయనతార నాయికగా నటిస్తున్నారు. ప్రియమణి ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తున్నారు.
జవాన్ రిలీజ్ అవుతున్న అదే టైమ్‌లోనే తన మావీరన్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు శివకార్తికేయన్. చూడగానే పక్కింటి అబ్బాయి లుక్కులో కనిపించే శివ కార్తికేయన్, ఇప్పుడు 100 కోట్ల హీరో. వరుసగా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మూవీస్‌తో హల్‌చల్ చేస్తున్నారు శివ. ప్రిన్స్ పెద్దగా ఆడలేదు. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం మావీరన్. ఈ సినిమాలో ఆయన కార్టూనిస్ట్ గా నటిస్తున్నారు. అదితి శంకర్ జర్నలిస్టుగా కనిపిస్తారు. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధమవుతున్న సినిమా ఇది. ఓటీటీ, శాటలైట్, ఆడియో బిజినెస్ ఎప్పుడో జరిగింది. శీనా శీనా అనే ఫస్ట్ సింగిల్ ఇటీవల విడుదలైంది.
ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్‌ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈనెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని అంచనా. ఆ తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు. దానికి తోడు గ్రాఫిక్స్ వర్క్ కూడా కాస్త ఎక్కువగానే ఉందట. అందుకే సినిమాను జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ ఎండింగ్ నుంచే ప్రమోషన్ వ్యవహారాలను మొదలుపెట్టేద్దామని అనుకుంటున్నారు మేకర్స్. మేలో చెన్నైలో భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. మావీరన్ రిలీజ్ కాగానే రాజ్‌కమల్ ఫిల్మ్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు శివకార్తికేయన్. ఈ చిత్రంలో ఆయనతో జత కట్టనున్నారు సాయిపల్లవి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
