Siva Balaji : యూట్యూబర్ పై శివ బాలాజీ ఫిర్యాదు!
on Sep 8, 2024
ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే యూట్యూబ్, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసిన కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు. అందులో కొన్ని నవ్వు తెప్పించినా మరికొన్ని చికాకు తెప్పిస్తాయి. తాజాగా ఓ యూట్యూబర్ పై శివ బాలాజీ (Siva balaji) పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్‌పై (Vijay chandrahas) నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కు (Cyber crime) ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఆర్య, శంభో శివ భంభో , చందమామ వంటి సినిమాలతో శివబాలాజీ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల లోనూ నటిస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. నేతోనే డ్యాన్స్, రేస్ వంటి టీవీ షోలతోనూ టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ‘శాకుంతలం’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించాడు.
Also Read