సీతారామం పార్ట్ 2 కి ఆ హీరో, హీరోయిన్ మీకు ఓకేనా!.. వైరల్ గా మారిన పిక్
on Jan 28, 2026

-సీతారామం సీక్వెల్ కి ముహూర్తం దగ్గర పడిందా!
-ఎవరెవరు ఉండబోతున్నారు
-సంచలనం గా మారిన పిక్
-సినీ విశ్లేషకులు ఏమంటున్నారు
నిజాయితీ, నిబద్దత, సంస్కారం తో కూడిన స్వచ్ఛమైన ప్రేమని సెల్యులాయిడ్ పై ప్రత్యక్షం చేసిన అపురూపమైన ప్రేమ చిత్రాల్లో 'సీతారామం ఒకటి. ప్రేమ అనేది కమర్షియల్ కాదు ఎమోషనల్. దాని ముందు మరణం చాలా చిన్నదనే విషయాన్నీ కూడా బలంగా చెప్పిన ఈ కల్ట్ క్లాసిక్ కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సదరు ఫ్యాన్ బేస్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు పోటీ పడుతు ఉంటారు. రిలీజ్ అయ్యి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ హృదయాల్లో సీతారామంకి ప్రత్యేక అర ని ఏర్పాటు చేసుకోవడమే అందుకు సాక్ష్యం. అంతటి ప్రత్యేకతని అందుకున్న సీతారామం ఇప్పుడు ఒకే ఒక్క పిక్ తో ఎన్నో సందేహాలకి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ డీటెయిల్స్ ని పూర్తిగా చూద్దాం.
సోషల్ మీడియాలో రీసెంట్ గా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వర్షంలో గొడుగు కింద ఎదురెదురుగా నిలబడి ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. దీంతో సీతారామం సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లబోతుందా అనే కామెంట్స్ ని ఫ్యాన్స్ తో పాటు సీతారామం లవర్స్ చేస్తున్నారు.దీంతో సినీ విశ్లేషకులు స్పందిస్తు సీతారామం లో రామ్ చనిపోయినట్టుగా క్లియర్ గా చూపించారు. కాబట్టి సీక్వెల్ కి ఆస్కారం అనేది ఉండకపోవచ్చు. దుల్కర్ సల్మాన్ ఒక సందర్భంలో సీక్వెల్ విషయంపై స్పందిస్తు క్లాసిక్ గా నిలిచిన సినిమాలని టచ్ చేయకూడదనే విషయాన్నీ సినిమాల్లోకి రాక ముందే తెలుసుకున్నాను. కాబట్టి సీక్వెల్ ఉండదని చెప్పాడు.
హను రాఘవపూడి, స్వప్న దత్, ప్రియాంక దత్ కూడా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి సదరు స్టిల్ దుల్కర్ , మృణాల్ కొత్త చిత్రానికి సంబంధించింది కావచ్చు. మేకర్స్ సదరు చిత్రాన్ని అధికారకంగా ప్రకటించే ముందు ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్ రిలీజ్ చేసి ఉండవచ్చు లేక ఏఐ తో అభిమానులు క్రియేట్ చేసి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Also read: దీన్ని అసలు రికార్డు అంటారా.. ఎవరు అక్కడ సెట్ చేసింది.
ఏది ఏమైనా అంతిమంగా సెల్యులాయిడ్ పై ఏమైనా జరగచ్చు. కాబట్టి సదరు స్టిల్ సీతారామం సీక్వెల్ కి సంబంధించి ఏమో. ఒక వేళ నిజమైతే అదే క్యాస్టింగ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ప్రెజంట్ ప్రభాస్ తో చేస్తున్న 'ఫౌజీ' తో బిజీగా ఉన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



