'సీతా రామం' జోరు.. రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి
on Aug 7, 2022
శుక్రవారం(ఆగస్టు 5న) 'బింబిసార'తో పాటు 'సీతా రామం' కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఓ వైపు 'బింబిసార' కలెక్షన్ల జోరు చూపిస్తున్నప్పటికీ క్లాస్ మూవీ అయిన 'సీతా రామం' కూడా ఏ మాత్రం తగ్గకుండా సత్తా చాటుతోంది. పైగా రెండో రోజు మొదటి రోజుని మించి కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.50 కోట్ల షేర్ రాబట్టిన 'సీతా రామం' రెండోరోజు రూ.2.08 కోట్ల షేర్ తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 11.50 కోట్ల బిజినెస్ చేసిన మూవీ.. రెండు రోజుల్లో రూ.3.58 కోట్ల షేర్(6.55 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో నైజాంలో రూ.1.39 కోట్ల షేర్(బిజినెస్ రూ.4 కోట్లు), సీడెడ్ లో రూ.0.37 కోట్ల షేర్(బిజినెస్ రూ.1.5 కోట్లు), ఆంధ్రాలో రూ.1.82 కోట్ల షేర్(బిజినెస్ రూ.6 కోట్లు) రాబట్టింది.
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 0.35 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 1.85 కోట్ల షేర్, ఇతర భాషల్లో 0.90 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రూ. 6.68 కోట్ల షేర్(13.30 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన మూవీ.. మొదటి రోజు 3.05 కోట్ల షేర్, రెండో రోజు 3.63 కోట్ల షేర్ తో రెండు రోజుల్లో 41 శాతం రికవర్ చేసింది.