రెండో రోజూ అదే జోరు.. భారీ లాభాల దిశగా 'బింబిసార'
on Aug 7, 2022
'బింబిసార'తో మొదటి రోజు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. బింబిసారుడి జోరు చూస్తుంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.6.30 కోట్ల షేర్ రాబట్టిన బింబిసార రెండోరోజు రూ.4.52 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.10.82 కోట్ల షేర్(16.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో నైజాంలో రూ.3.92 కోట్ల షేర్(బిజినెస్ రూ.5 కోట్లు), సీడెడ్ లో రూ.2.24 కోట్ల షేర్(బిజినెస్ రూ.2 కోట్లు), ఆంధ్రాలో రూ.4.46 కోట్ల షేర్(బిజినెస్ రూ.6.50 కోట్లు) రాబట్టింది.
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 0.50 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 1.05 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రూ.12.37 కోట్ల షేర్(20 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.15.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన మూవీ.. మొదటి రోజు 7.27 కోట్ల షేర్, రెండో రోజు 5.10 కోట్ల షేర్ తో రెండు రోజుల్లోనే దాదాపు 80 శాతం రికవర్ చేసింది. ఈరోజు బ్రేక్ ఈవెన్ సాధించి మూడు రోజుల్లోనే బయ్యర్లకు ప్రాఫిట్స్ తీసుకొచ్చే అవకాశముంది.
Also Read