కళ్యాణ్ రామ్ పై అల్లు అర్జున్ ప్రశంసలు
on Aug 7, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార' మంచి కలెక్షన్స్ రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. మల్లిడి వశిష్ఠ్ డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ పై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎందరో స్టార్స్ ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా అల్లు అర్జున్ కూడా ప్రశంసించాడు.
ట్విట్టర్ వేదికగా 'బింబిసార' టీమ్ కి శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. సినిమా అద్భుతంగా ఉందని, కళ్యాణ్ రామ్ నటన ఆకట్టుకుందని కొనియాడాడు. కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, విభిన్న చిత్రాలను అందించే కళ్యాణ్ రామ్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమే అని బన్నీ తెలిపాడు. డైరెక్టర్ గా వశిష్ఠ్ కిది తొలి చిత్రమైనా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించాడు. ఇది అన్ని వయసుల వారిని అలరించే చిత్రమంటూ.. మూవీ టీమ్ ని అభినందించాడు బన్నీ.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
Also Read