సింగర్ స్మితకు కొవిడ్-19 పాజిటివ్!
on Aug 4, 2020

తెలుగులో ఏకైక పాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న స్మిత కొవిడ్-19కు గురయ్యారు. టెస్ట్‌లో ఆమెతో పాటు ఆమె భర్త శశాంక్ కూడా పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. "Mad mad day yesterday. ఒంటి నొప్పులు రావడంతో అధిక వ్యాయామం వల్ల వచ్చాయేమోనని మొదట అనుకున్నాను. తర్వాత ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నాం. శశాంక్, నేను కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. లక్షణాలైతే ఎక్కువగా ఏమీ లేవు. కొవిడ్ నుంచి బయటకు వచ్చాక ప్లాస్మా డొనేట్ చేస్తాం. ఇంట్లో ఉన్నాం.. క్షేమంగా ఉన్నాం.. కానీ ఇంటికి కొవిడ్ వచ్చింది" అని ఆమె ట్వీట్ చేశారు.
"ఇంట్లో ఉన్నా ఎలా వచ్చిందో చెప్పగలరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?" అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఎలక్ట్రిషియన్ వల్ల వచ్చుండవచ్చనీ, తమ ఇంట్లో అతను లైట్లు ఫిక్స్ చేయడానికి వచ్చాడనీ ఆమె సమాధానమిచ్చారు. అది తప్ప తమకు కొవిడ్ సోకడానికి వేరే లింకేమీ కనిపించడం లేదని చెప్పారు.


Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



