గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సింగర్ మంగ్లీ
on Dec 25, 2019
.jpeg)
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మణికొండలోని జీహెచ్ఎంసీ పార్క్‌లో సింగర్ మంగ్లీ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకింద కూర్చుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించే వారనీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోతున్నాయనీ అన్నారు. దాని వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమండలం వేడెక్కుతోందని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ అన్నకు వచ్చిన ఆలోచన చాలా గొప్పదని, ఆ ఆలోచనకు తాను సెల్యూట్ చేస్తున్నాననీ ఆమె అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మరొక ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఆ ముగ్గురు.. సుడిగాలి సుధీర్, యాంకర్ శ్రీముఖి, 'జార్జి రెడ్డి' సినిమా హీరో సందీప్ మాధవ్.
.jpeg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



