'బంగారం' హీరోయిన్‌కు చిన్మయి సపోర్ట్
on Jun 3, 2020

లాక్‌డౌన్ పీరియడ్‌లో టైమ్‌పాస్ కోసం సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతుండటం గమనిస్తున్నాం. అలాంటి ముచ్చట్లు 'బంగారం' ఫేమ్ మీరా చోప్రాకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ట్విట్టర్‌లో అభిమానులను ప్రశ్నలను సంధించమనీ, వాటికీ ఆన్సర్లు ఇస్తాననీ చెప్పిన ఆమె, ఆ సందర్భంగా ఓ ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్‌కు గురైంది. "ఆయన (తారక్) ఎవరో నాకు తెలీదు.. నేను ఆయన ఫ్యాన్‌ని కాదు" అని ఆమె చెప్పిన సమాధానమే దీనికి కారణం. తనను దూషిస్తూ పెట్టిన పోస్టులపై ఆమె హైదరాబాద్ పోలీసులకు సైబర్ వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. అయితే తారక్ ఫ్యాన్స్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె పెట్టిన పాత పోస్టులను బయటకు లాగి, సోషల్ మీడియాలో ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టారు.
దీంతో ఫైర్‌బ్రాండ్ సింగర్ చిన్మయి మీరాకు మద్దతుగా నిలబడింది. ఆమెను ట్రోల్ చేస్తోన్న తారక్ ఫ్యాన్స్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాల్సిందిగా మీరాకు సూచించింది. కాగా తమ హీరోను కించపరిచే పోస్టులను, సెటైరికల్ ట్వీట్స్‌ను ఎందుకు లైక్ చేస్తోందో మీరా చోప్రా వివరణ ఇవ్వాలంటూ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తన పోస్ట్ ద్వారా మీరా కాంట్రవర్సీ సృష్టించడమే కాకుండా, అనవసరంగా తారక్‌ను ఈ గొడవలోకి లాగిందని కొంతమంది అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



