Home

»

Latest News

Sing Geetham: 'సింగ్ గీతం' సెన్సార్ రిపోర్ట్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మ్యాజిక్!

Jun 9, 2026 4:14PM

టాలీవుడ్ లో సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్న లేటెస్ట్ మూవీ 'సింగ్ గీతం' (Sing Geetham). ఈ చిత్రానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన అధికారిక అప్‌డేట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా తన సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు క్లీన్ 'U' సర్టిఫికేట్‌ను జారీ చేశారు. అంటే ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా, కుటుంబ సమేతంగా థియేటర్లలో హ్యాపీగా కూర్చుని చూడదగ్గ ఒక స్వచ్ఛమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టమైంది.

ఈ సినిమా రన్‌టైమ్ కూడా చాలా క్రిస్ప్‌గా లాక్ చేయబడింది. థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమైన ఈ సినిమా మొత్తం నిడివి కరెక్ట్‌గా 137.00 నిమిషాలు (అనగా 2 గంటల 17 నిమిషాలు). ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు సుదీర్ఘమైన సినిమాల కంటే వేగంగా సాగిపోయే కథనాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ కోణంలో చూసుకుంటే 2 గంటల 17 నిమిషాల రన్‌టైమ్ అనేది థియేటర్లలో ఆడియన్స్‌ను బోర్ కొట్టించకుండా, కథతో పాటు ట్రావెల్ చేయించడానికి పక్కాగా సరిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. మాటలకు బదులుగా పాటలతో చేసిన ప్రయోగం కొత్త అనుభూతిని ఇస్తుంది అంటున్నారు.

ఈ విలక్షణమైన సినిమాకు టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించడం విశేషం. ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పక విమానం, విచిత్ర సోదరులు వంటి ఎన్నో క్లాసిక్స్ ని అందించిన ఆయన వయసుతో సంబంధం లేకుండా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ఈ తరం మెచ్చేలా 'సింగ్ గీతం' చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. 

మహానటి, కల్కి 2898 AD వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం మార్ విశేషం. 'సింగ్ గీతం' సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 94 ఏళ్ళ వయసులో సింగీతం రూపొందించిన ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com