
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)వరుస ప్లాప్స్ ని చవిచూస్తున్నా వైవిధ్యమైన కథల ఎంపికలో తగ్గేదెలే అంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ, వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ చిత్రాలతో అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం 'కొరియన్ కనకరాజు' చేస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆగస్టు 7న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మూవీ సెట్స్ పై ఉన్నప్పుడే 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో 'బరి' అనౌన్స్ చేసాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వాలీబాల్ ఆట నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని వరుణ్ సోదరి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథా నేపథ్యం ప్రకారం, హీరో క్యారక్టర్ అత్యంత లీన్‌గా, అల్ట్రా ఫిట్‌గా కనిపించాల్సి ఉంటుంది. క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా పండాలనే ఉద్దేశంతో దర్శకుడు వరుణ్ తేజ్ ని "బాగా సన్నబడాల్సిందే" అని ఒక గట్టి కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. కథపై ఉన్న నమ్మకంతో,క్యారక్టర్ డిమాండ్ చేయడంతో వరుణ్ తేజ్ కూడా వెనకడుగు వేయకుండా ఈ ఛాలెంజ్‌ని స్వీకరించడానికి సినీ సర్కిల్ టాక్ .
The odyssey: టికెట్ రేట్ 3300 .. అయినా సరే నిమిషాల్లో హౌస్‌ఫుల్
ఇందుకోసం 'కొరియన్ కనకరాజు' ప్యాచ్ వర్క్, బ్యాలన్స్ షూటింగ్‌ని పూర్తి చేసిన వెంటనే, వరుణ్ తేజ్ దాదాపు 2 నెలల పాటు సినిమాలకి పూర్తిగా బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఈ 60 రోజుల విరామ సమయంలో ఆయన ప్రత్యేకంగా ఫిట్‌నెస్, వెయిట్ లాస్ కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. గతంలో 'గద్దలకొండ గణేష్' వంటి చిత్రాల కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న వరుణ్ తేజ్, ఇప్పుడు 'బరి' సినిమా కోసం మరోసారి సరికొత్త మేకోవర్ అవ్వడానికి సిద్ధమవుతున్నాడు.






