Home

»

Latest News

శింబు "సై" అన్నాడు.. 9తార, హన్సికలు వెయిట్ చేస్తున్నారు...!

Jun 30, 2016 10:20AM


 

తమిళ హీరో శింబుకు ఉన్నన్ని లవ్ స్టోరీలు ఆ మన్మధుడికి కూడా ఉండి ఉండవు. మనోడి చేతికి చిక్కని హీరోయినూ లేదు, మనోడు రొమాన్స్ చేయని భామా లేదు. అలాంటి శింబు ఈమధ్యకాలంలో బాగా డల్ అయిపోయాడు. సరైన హిట్ సినిమా లేకపోవడం ఒక కారణం అయితే.. అతగాడు చేసిన "బీప్ సాంగ్" తమిళనాట పెనుదుమారం రేపింది. దాదాపు మనోడ్ని జైల్లో పెట్టినంత పని చేశారు. ఈ విధంగా శింబు చాలా హర్ట్ అయ్యాడు. ముఖ్యంగా తన మాజీ లవర్స్ నయనతార, హన్సికలు కొత్త బోయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుండడం కూడా శింబుకి మింగుడుపడడం లేదు. శింబు బాధపడడం చూస్తూ ఊరికే ఉండలేకపోయాడు అతడి తండ్రి, వెంటనే శింబుకి పెళ్ళి చేసేయాలని ఫిక్స్ అయిపోయాడట. చిత్ర పరిశ్రమకి చెందిన అమ్మాయిని కాకుండా తన బంధువర్గంలో అమ్మాయితో శింబు వివాహం జరిపించాలని చూస్తున్నాడాయన. సో, శింబు పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని తమిళ తంబిలతోపాటు అతని మాజీ ప్రేమికురాళ్ళు నయనతార, హన్సికలు కూడా వెయిట్ చేస్తున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com