Home

»

Latest News

యాక్సిడెంట్‌కు గురైన బాలకృష్ణ కారు...!

Jun 29, 2016 5:27PM

తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. హిందూపురం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన బాలయ్య తన పని ముగించుకుని తిరిగి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు ప్రయాణమయ్యారు. కారులో హిందూపురం నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళుతుండగా బాగేపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఓవర్‌టేక్ చేయబోతుండగా గేదే అడ్డురావడంతో దానిని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బాలయ్య కారు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే డిక్టేటర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు వెళ్లిపోయారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com