Home

»

Latest News

బాలకృష్ణ కారు యాక్సిడెంట్ కి అసలు కారణం...!

Jun 30, 2016 11:01AM


సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారనే విషయం మీకు తెలిసిందే. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. నేనే స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నాను... లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా గేదెలు అడ్డువచ్చిన సమయంలో నా కారుకు ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి... నిజానికి నేను కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో  టోల్‌గేట్‌ వద్ద అభిమానులు నా కారును ఆపేసి భారీ మా లతో సత్కరించారు. ఆ మాలను కారు పై భాగంలో వేసుకొని కార్ డ్రైవ్ చేస్తున్న సమయంలో. చెండూరు క్రాస్‌-వర్లకొండ వద్దకు రాగానే ఆ భారీ మాల ముందు వైపు అద్దంపైకి జారడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దాను, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com