స్టేజ్ మీద ఏడ్చేసిన సిద్దార్థ్.. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు!
on Oct 3, 2023
'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి ఘన విజయాలతో తమిళ హీరో సిద్దార్థ్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య తెలుగులో సిద్దార్థ్ తగ్గిపోయాయి. వస్తున్న ఒకటి అరా డబ్బింగ్ సినిమాలు కూడా పెద్దగా ఆదరణకు నోచుకోవడంలేదు. దీంతో అసలు సిద్దార్థ్ సినిమాలు ఎవరు చూస్తారు అంటూ.. ఆయన సినిమా తీసుకోవడానికి తెలుగు నుంచి బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సిద్దార్థ్.. ఎమోషనల్ అయ్యాడు.
సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ 'చిత్త'. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా ప్రశంసలు అందుకోవడంతో పాటు రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా 'చిన్నా' పేరుతో అక్టోబర్ 6న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సిద్దార్థ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
"ఈ సినిమాని తమిళనాడులో ఇలాంటి గొప్ప సినిమా చూడలేదని ఉదయనిధి స్టాలిన్ కొన్నారు. కేరళలో నెం.1 నిర్మాత గోకులం గోపాలం గారు కొన్నారు. కర్ణాటకలో కేజీఎఫ్ నిర్మాతలు తీసుకున్నారు. కానీ తెలుగు విషయానికి వస్తే సిద్దార్థ్ సినిమా ఎవరు చూస్తారు, ఎందుకు చూస్తారని అన్నారు. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు నా సినిమా చూస్తారని నేను అన్నాను. అలాంటి సమయంలో మేం నీతో ఉన్నామంటూ ఏషియన్ సునీల్ గారు ముందుకు వచ్చారు. అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. ఇంతకంటే గొప్ప సినిమా నేను మళ్ళీ తీయలేను. ఈ సినిమా మీకు నచ్చకపోతే ఇక మీదట నా సినిమాలు చూడండని మిమ్మల్ని అడగను" అని మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు సిద్దార్థ్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
