అఫిషియల్: ప‌్రభాస్ జోడీ శ్రుతి!
on Jan 28, 2021

అందాల తార శ్రుతి హాసన్‌కు 'సలార్' టీమ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. గురువారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెను ప్రభాస్ సరసన హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు 'సలార్' నిర్మాతలు ప్రకటించారు. ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే 'సలార్'ను హోంబళే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో శ్రుతికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, సలార్ టీమ్‌లోకి ఆమెకు వెల్‌కమ్ చెబుతూ ఓ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. దాంతో పాటు, "Wish you a very happy birthday @shrutihaasan. We're ecstatic to have you onboard for #Salaar. Can't wait to see you sizzle on the screen." అంటూ రాసుకొచ్చారు. జనవరి 15న 'సలార్' లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
శ్రుతి హాసన్ మునుపటి తెలుగు సినిమా 'క్రాక్' సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, లాక్‌డౌన్ తర్వాత రిలీజై, బ్లాక్‌బస్టర్ అయిన తొలి ఇండియన్ మూవీగా కూడా రికార్డుల్లోకి ఎక్కింది. పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతి నటించిన 'వకీల్ సాబ్' రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్‌తో 'సలార్' ఆమెకు తొలి సినిమా. ఇది ఆమెకు అనూహ్యమైన ఆఫర్ అనే చెప్పాలి. మరోవైపు ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీని పూర్తి చేసే పనిలో ఉండగా, ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



