నా శరీరం నా ఇష్టం.. రేపు ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటాను
on Jun 21, 2025

యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శృతి హాసన్(Shruti Haasan). దశాబ్దంన్నర కాలం నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. హీరోలకి హిట్ ని ఇచ్చే మోస్ట్ లక్కీయేస్ట్ హీరోయిన్ అనే పేరు కూడా శృతి హాసన్ కి ఉంది. తెలుగు చిత్ర పరిశమ్రలో దాదాపుగా అగ్ర హీరోలందరితోను జత కట్టిన శృతి, మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా, తన పర్సనల్ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడుతుంది.
రీసెంట్ గా శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'టీనేజ్ లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చకపోవడంతో 'సర్జరీ' చేయించుకున్నాను. ముఖం మరింత అందంగా కనిపించేందుకు 'పిల్లర్స్' వాడాను. కొంత మంది వీటిని బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ నాలా దైర్యంగా చెప్పే వాళ్ళని తప్పు పడుతున్నారు. భవిష్యత్తులో వయసు ఎక్కువయ్యాక 'ఫేస్ లిఫ్ట్' కూడా చేయించుకుంటానేమో. అవన్నీ పూర్తిగా నా వ్యక్తి గత నిర్ణయాలు. నా శరీరం నా ఇష్టం. ఇతరులకీ ఇబ్బంది లేనప్పుడు ఈ విషయాల్ని దాచుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్'(Rajinikanth),'నాగార్జున'(Nagarjuna),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)కాంబోలో తెరకెక్కుతున్న 'కూలీ(Coolie)'లో హీరోయిన్ గా చేస్తుంది. ఇళయ దళపతి 'విజయ్'(Vijay) లాస్ట్ మూవీగా పిలవబడుతున్న 'జన నాయగాన్'(Jananayagan) లో ఒక ముఖ్య పాత్రతో పాటు, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) అప్ కమింగ్ మూవీ 'ట్రైన్' లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూడు కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ట్ చిత్రాలే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



