Home

»

Latest News

మగవాళ్ళ పీరియడ్స్ పై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు: కారవాన్‌లో జరిగింది ఇదే!

Sep 19, 2026 10:30AM

 

ఐరన్ లెగ్ స్థాయి నుంచి శృతి హాసన్ మా సినిమాలో ఉండేలా చూడు అని హీరోలు, హీరో అభిమానులు తమ ఇష్టదైవాల్ని ప్రార్ధించే స్థాయికి ఎదిగింది కమల్ డాటర్ శృతి హాసన్. సెల్యులాయిడ్ పై తన బొమ్మ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ బోల్డ్, స్ట్రయిట్ ఫార్వర్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ టాక్ షో లో శ్రుతి హాసన్ పాల్గొంది.


 అందులో ఆమె మాట్లాడుతు 'పీరియడ్స్ సమయంలో మహిళలు అనుభవించే శారీరక, మానసిక నరక ప్రాయమైన బాధను సమాజం మరియు చిత్రపరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు . 13 ఏళ్ల వయసులోనే మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు మొదలైన తీవ్రమైన కడుపునొప్పి, సంవత్సరాల తరబడి వేధించింది. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నందున, పీరియడ్స్ వస్తే దాదాపు 12 రోజుల పాటు నరకం చూసేదాన్ని. స్కూల్ రోజుల్లో తీవ్రమైన నొప్పితో స్పృహతప్పి పడిపోవడం మరియు వాంతులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారేది.  

ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల ద్వీతీయ గండం దాటుతాడా!

ఆ  కడుపునొప్పి తట్టుకోలేక తరచుగా ఆసుపత్రికి పరుగెత్తి ఐవీ ఫ్లూయిడ్స్, స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వచ్చేదాన్ని. ఆ సమయంలో అనీమియాతో బాధపడుతూ బరువు తక్కువగా ఉండటం వల్ల పీరియడ్స్  శారీరకంగా ఎంతగానో బలహీనపరిచాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య మరింత జటిలమైంది.

 

 

షూటింగ్ సెట్స్‌లో తీవ్రమైన పీరియడ్ క్రాంప్స్ ఉన్నప్పటికీ డ్యాన్స్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు చేయాల్సి వచ్చేదని, కారవాన్‌లోకి వెళ్లి వాంతులు చేసుకుని మళ్లీ వచ్చి కెమెరా ముందు నటించేదాన్ని. అసలు 'మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని నేను రోజుకు వేలసార్లు దేవుడిని కోరుకున్నాను. పురుషులకు కూడా పీరియడ్స్ వస్తేనే ఆ నొప్పి ఎలాంటిదో వారికి స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడైనా సినీ నటీమణుల, మహిళా ఉద్యోగుల పని కాంట్రాక్టులలో అధికారికంగా 'పీరియడ్ లీవ్స్' లేదా ప్రత్యేక సెలవుల నిబంధనని  చేరుస్తారని చెప్పుకొచ్చింది. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'ట్రైన్' మరియు దుల్కర్ సల్మాన్‌తో పలు క్రేజీ ప్రాజెక్టులలో శ్రుతి ఫుల్ బిజీ.


 మీకు నచ్చవచ్చు:అను ఇమ్మానియేల్ సంచలన నిర్ణయం: ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఊహించలేదు!

 

 

[Shruti Haasan,  Bold Comments On Men Period Pain, PCOS Dysmenorrhea, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News}

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com