
థియేటర్లలో ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో కూడా తన సునామీని కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆయన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీలో అడుగుపెడుతూనే సరికొత్త చరిత్ర సృష్టించింది.
మన దేశంలో నంబర్ వన్‌గా ట్రెండ్ అవ్వడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల విభాగంలో ఏకంగా గ్లోబల్ టాప్ 3లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ వీకెండ్ లోనే 5.5 మిలియన్ వ్యూస్ సాధించింది. 2026లో ఒక సౌత్ ఇండియన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సాధించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ఇది. 2024 తర్వాత ఒక తమిళ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో దక్కించుకున్న హయ్యెస్ట్ ఫస్ట్ వీకెండ్ వ్యూస్ రికార్డ్ కూడా కావడం విశేషం.
ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 4 దేశాల్లో నంబర్ 1 పొజిషన్‌లో, అలాగే 10కి పైగా దేశాల్లో టాప్ 10 జాబితాలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' దుమ్మురేపుతోంది. సూర్య మార్క్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, మమితా బైజు నటన, జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: 'రాకా' స్టోరీ లీక్.. గ్లోబల్ మార్కెట్‌ను షేక్ చేయనున్న అల్లు అర్జున్.!

ఇప్పటివరకు ఓటీటీల్లో యాక్షన్ సినిమాలే ఆధిపత్యం చెలాయిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఇంతటి గ్లోబల్ ఇంపాక్ట్ చూపించడం ఇండియన్ సినిమాలోనే ఒక రేర్ ఫీట్ అని చెప్పవచ్చు.
మీకు నచ్చవచ్చు: మువ్వలా నవ్వకలా.. ప్రభాస్ కెరీర్‌లో మళ్ళీ ఇలాంటి పాట రాదేమో.!
[Vishwanath and Sons Movie, Vishwanath and Sons Netflix, Vishwanath & Sons Netflix, Vishwanath and Sons OTT, Suriya Netflix, Mamitha Baiju, Venky Atluri, Telugu Film News, Telugu News]




