'సలార్' నుంచి సర్ ప్రైజ్ వచ్చింది!
on Jan 27, 2022
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సలార్'. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సలార్ నుంచి ఓ సర్ ప్రైజ్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
నేడు(జనవరి 28) శృతి హాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో శృతి లుక్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె ఆద్య పాత్రలో కనిపించనుందని పోస్టర్ లో తెలిపారు.
ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సలార్ తో పాటు 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ k', 'స్పిరిట్' వంటి సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఇక శృతి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ విషయానికొస్తే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్-2' విడుదలకు రెడీగా ఉంది.