Home

»

Latest News

హోటల్‌లో అడ్డంగా దొరికిపోయిన శ్రియ‌

Oct 13, 2016 2:52PM

 

శ్రియ ఓ క్రికెట‌ర్‌తో ల‌వ్వాట ఆడుతోందా?  త‌న‌తో డేటింగ్ చేస్తోందా?  అవున‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న శ్రియ‌, వెస్టిండీస్ ఆల్ రౌండ‌ర్ బ్రావోతో డేటింగ్ చేస్తోంద‌ట‌. వీరిద్ద‌రూ ముంబైలోని ఓ హోటెల్‌లో మీడియాకు అడ్డంగా దొరికిపోయార‌ని టాక్‌.  ముంబైలోని ఓ స్టార్ హోటెల్‌లో లంచ్ ముగించుకొన్న శ్రియ‌, బ్రావోలు బ‌య‌ట‌కు వ‌స్తూ మీడియా కంట క‌న‌ప‌డ్డార‌ని, కెమెరాలు ఆన్ అవ్వ‌గానే అప్ప‌టి వ‌రకూ చేతులో చేయి వేసుకొని న‌డుస్తున్న శ్రియ‌, బ్రావోలు చేతులు విడిచి.. తామెవ్వ‌రో తెలియ‌నట్టు న‌డిస్తూ చెరో కారులో వెళ్లిపోయార‌ని చెప్పుకొంటున్నారు. ఐపీఎల్‌లో బ్రావో చెన్నై త‌ర‌పుప‌న ఆడాడు. ఆ స‌మ‌యంలోనే బ్రావోకీ, శ్రియ‌కీ మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని,  ఇప్పుడు డేటింగుకు వెళ్లే స్థాయిలో మారింద‌ని, ఇద్ద‌రూ కొంత‌కాలంగా డేట్‌లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది శ్రియ‌. చిరంజీవి 150వ సినిమాలోనూ ఆఫ‌ర్ అందింద‌చి చెప్పుకొంటున్నారు. టాలీవుడ్‌లో మ‌ళ్లీ అవ‌కాశాలొస్తున్న త‌రుణంలో.. స‌డ‌న్ గా రూటు మార్చి ఇలా ల‌వ్‌లో ప‌డిపోయిందేంటో?? 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com