
చిరంజీవి 150వ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమా కోసం లక్ష్మీరాయ్‌ని ఐటెమ్ భామగా తీసుకొన్నారు. చిరు - లక్ష్మీరాయ్ లపై ఓ పాటని గురువారం నుంచి హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ ఈ పాటకు డాన్స్ మాస్టర్ ఎవరో తెలుసా?? లారెన్స్. చిరుతో లారెన్స్ కాంబినేషన్ లో చాలా హిట్ గీతాలొచ్చాయి. ఇప్పుడు మరోటి చేరబోతోందన్నమాట. ఖైదీ నెం. 150వ కోసం కేథరిన్ థెరిస్సాని ఐటెమ్ గాళ్‌గా తీసుకొంటారన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషాల్లో ఆ ఛాన్స్ లక్ష్మీరాయ్ చేజిక్కించుకొంది. సర్దార్ గబ్బర్ సింగ్‌లో పవన్ తో తోబ తోబ పాటకు చిందులేసింది లక్ష్మీరాయ్. అప్పుడు తమ్ముడుతో రొమాన్స్ చేసిన లక్ష్మీరాయ్ ఇప్పుడు అన్నయతో స్టెప్పులు వేయబోతోందన్నమాట. 2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటోంది చిత్రబృందం. ఈ దీపావళికి టీజర్‌ని రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.




.jpg)

