Home

»

Latest News

'చిరు' ఆఫర్ కి నో! 'పవర్'ఫుల్ ఆఫర్ సై...

Oct 13, 2016 3:13PM

 

కొందరు హీరోయిన్స్ ని తెరపై మరింతగా చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. కాని, వాళ్లు మాత్రం కొసిరి కొసిరి సినిమాలు చేస్తుంటారు. ఇలా వచ్చి ఊరించి... అలా ఉసూరుమనిపించి వెళ్లిపోతుంటారు. ఎస్... మనం మాట్లాడుకుంటోంది , ది టెంప్ట్ట్రస్, నయనతార గురించే! చంద్రముఖి సినిమాతో బొద్దుగా పరిచయమైన నయన అప్పట్లో ఎంతో ముద్దొచ్చింది. ఫ్యాన్స్ కలవరింతలు మొదలు పెట్టారు. లక్ష్మీ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేసి నయన కూడా నాటీగా అలరించింది. కాని, అంతలోనే తమిళనాడుకు వెళ్లిపోయింది. అక్కడ స్లిమ్ గా, సెక్సీగా ఫిగర్ మార్చుకుని వరుస సినిమాలు చేసింది. తెలుగు వాళ్లు మాత్రం నయన డబ్బింగ్ అందాలు చూస్తూనే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది.

 

కేరళ నారికేళం లాంటి నయనకి తెలుగులో భీభత్సమైన క్రేజ్ వుంది. అయినా ఎందుకోగాని ఇక్కడ కాజల్, తమన్నా లాగా ఎక్కువ సినిమాలు చేయలేదు. అప్పుడప్పుడూ వచ్చిపోతూ శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు చేసింది. ప్రతీసారి ఆడియన్స్ ఆదరించారు. అయితే, గత కొంత కాలంగా తెలుగు సినిమాలు అస్సలు సైన్ చేయటం లేదు ఈ సింహా సుందరి!  నయన స్ట్రెయిట్ తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆమె ఫ్యాన్స్ కు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నయనతార నన్ అదర్ ద్యాన్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా బుక్కైందట. ఆల్రెడీ సైన్ కూడా చేసేసిందంటున్నారు. ఇదంతా అఫీషియల్ గా తెలిసే వరకూ మనం ఏం చెప్పలేం. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధింది ఏదీ న్యూసో... ఏది గాసిప్పొ ఎవరు చెప్పగలరు? బట్ పవర్ స్టార్ తో నయన అంటే అది మాత్రం ఖచ్చితంగా క్రేజీ కాంబినేషనే! అంతే కాదు, చిరు 150వ సినిమా ఆఫర్ కూడా రెమ్యూనరేషన్ కోసం కాదన్న నయన్ ఇప్పుడు తమ్ముడితో రొమాన్స్ కి రెడీ అవటం... కొంత ఆశ్చర్యమే! 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com