ఆ రోజు ఫ్లైట్ లో శ్రద్దాకపూర్ రాహుల్ మోడీ ఉన్నారు.. ఇవిగో పిక్స్
on Jul 10, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)సుజిత్(sujeeth)కాంబినేషన్ లో తెరకెక్కిన 'సాహో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ నటి 'శ్రద్దాకపూర్'(Shraddha Kapoor). ఒకప్పటి అగ్ర నటుడు 'శక్తీ కపూర్' కూతురిగా 2010 లో హిందీ సినీ సినీ రంగ ప్రవేశం చేసిన శ్రద్దా, ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలని పోషించి స్టార్ డమ్ ని సంపాదించింది.
ప్రముఖ రచయిత రాహుల్ మోడీ(Rahul Mody)తో శ్రద్దాకపూర్ డేటింగ్ లో ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ ఇద్దరు కలిసి ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్ తో ఉన్న ఆ ఇద్దరు, పక్క పక్క సీట్స్ లో కూర్చోగా, రాహుల్ కి శ్రద్ధ ఫోన్ లో ఏదో చూపిస్తూ ఉంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు ఆ ఇద్దరి ఫోటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక వీడియోని కూడా రికార్డు చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రద్ధ, రాహుల్ కి తెలియకుండా ఎయిర్ లైన్స్ సిబ్బంది ఫోటోలు తీయడంపై, పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. రాహుల్, శ్రద్ధ కలిసి చాలాసార్లు మీడియాకి పోజులిచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ గత ఏడాది చివరలో విడుదలైన 'స్త్రీ 2 'లో ప్రధాన క్యారక్టర్ ని పోషించి మంచి విజయాన్ని అందుకుంది. ప్యార్ కా పంచనామా, సోను కె టైటుకి స్వీటీ, దే దే ప్యార్ దే, తు ఝూతి మెయిన్ మక్కర్ వంటి చిత్రాలకి రచయితగా పని చెయ్యడంతో పాటు దర్శకత్వ శాఖలోను పని చేసాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
